Soldier: గీత దాటిన చైనా సైనికుడ్ని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం

  • భారత భూభాగంలో ప్రవేశించిన చైనా సైనికుడు
  • నిన్న వేకువ జామున అతడిని పట్టుకున్న జవాన్లు
  • విచారణ జరుపుతున్నామన్న సైన్యం
  • గత అక్టోబరులోనూ ఇదే తరహా ఘటన
Indian army captures Chinese soldier at LAC near Ladakh

సరిహద్దు దాటి భారత భూభాగంలో ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖకు సమీపంలో ఆ చైనా సైనికుడిని భారత జవాన్లు గుర్తించారు. వివాదాస్పద పాంగాంగ్ ట్సో సరస్సు ప్రాంతం నుంచి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు తెలుసుకున్నారు.

జనవరి 8 వేకువజామున అతడిని పట్టుకున్నట్టు భారత సైన్యానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. సరిహద్దు నిబంధనల ప్రకారం అతడిని విచారిస్తున్నామని తెలిపారు. అతడు సరిహద్దులు దాటడానికి గల కారణాలు ఏమిటి? ఇతర పరిస్థితులేమైనా అందుకు దారితీశాయా? అనేది విచారణలో తేలుతుందని ఆ అధికారి పేర్కొన్నారు.

గతేడాది అక్టోబరులోనూ వాంగ్ యా లాంగ్ అనే చైనా సైనికుడు ఇలాగే భారత్ లో ప్రవేశించాడు. అయితే అతడు దారితప్పి మన భూభాగంలో అడుగుపెట్టాడని తెలుసుకున్న భారత సైన్యం భద్రంగా చైనాకు అప్పగించింది.

More Telugu News