స్థానిక ఎన్నికల ఉత్తర్వులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్

09-01-2021 Sat 17:50
  • పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్ఈసీ
  • ఎన్నికలకు ఇది సరైన సమయం కాదంటున్న ప్రభుత్వం 
  • సోమవారం విచారించనున్న హైకోర్టు  
AP govt files petition against Panchayat elections

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని ప్రభుత్వం చెపుతుండగా... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిన్న రాత్రి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నోటిఫికేషన్ విడుదల చేయడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు సోమవారం విచారించనుంది.