కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న శిల్పా శిరోద్కర్!

09-01-2021 Sat 15:18
  • దుబాయ్ లో వ్యాక్సిన్ వేయించుకున్న శిల్పా శిరోద్కర్
  • తనకు వ్యాక్సిన్ ఇచ్చినందుకు యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన శిల్ప
  • వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితంగా ఉంటుందని హితవు
Actress Shilpa Shirodkar takes Corona vaccine

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికించింది. సామాన్యుడు, సంపన్నుడు అనే తేడాలేకుండా అందరూ దీని దెబ్బకు బెంబేలెత్తిపోయారు. ఎందరో ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కరోనా వ్యాక్షిన్ కోసం ఎదురు చూసింది. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ జనాలకు అందుబాటులోకి వస్తోంది. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైంది. మన దేశంలో ప్రస్తుతం డ్రైరన్ జరుగుతోంది.

మరోవైపు బాలీవుడ్ నటి శిల్పాశిరోద్కర్ కరోనా టీకా వేయించుకున్నారు. ఈమె మరెవరో కాదు, సినీ నటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కు సోదరి. తాను వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. దుబాయ్ లో ఉంటున్న ఆమె... అక్కడే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితంగా ఉంటుందని... మనం మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని ఈ సందర్భంగా ఆమె అన్నారు. తనకు వ్యాక్సిన్ ఇచ్చినందుకు యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నానని వ్యాఖ్యానించారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కావడం గమనార్హం.