గ‌డ్డం, సిక్స్ ప్యాక్ తో సందీప్ కిష‌న్.. 'ఏ1 ఎక్స్ ప్రెస్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

09-01-2021 Sat 13:33
  • కొత్త గెట‌ప్ లో సందీప్ కిష‌న్
  • స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా  
  • హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి 
sandeep kishan new movie first look releases

 సందీప్ కిష‌న్ హీరోగా అప్ప‌ట్లో వ‌చ్చిన‌ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమా ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ హీరో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ ఈ రోజు విడుద‌లైంది. కొత్త గెట‌ప్ లో సందీప్ కిష‌న్ క‌న‌ప‌డుతున్నాడు. గ‌డ్డం, సిక్స్ ప్యాక్ తో ఆయ‌న క‌న‌ప‌డుతోన్న తీరు ఆకట్టుకుంటోంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోన్న నేప‌థ్యంలో ఆయ‌న ఇటువంటి అవ‌తారంలో క‌న‌ప‌డుతున్నాడు. ఓ చేతిలో హాకీ స్టిక్ ప‌ట్టుకుని, తన చొక్కా విప్పేసి విజ‌య ద‌ర‌హాసంతో ఆయ‌న గంతులేస్తున్న‌ట్లు ఈ లుక్ ఉంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.