బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో పిటిషన్

09-01-2021 Sat 13:16
  • 32 మందిని నిర్దోషులుగా పేర్కొన్న సీబీఐ కోర్టు
  • పిటిషన్ వేసిన హాజీ మహ్మద్‌ అహ్మద్‌, సయ్యద్‌ అల్కఖ్‌ అహ్మద్‌  
  • తీర్పును పునఃసమీక్షించాలని విన‌తి
petition file on babri verdict

అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో మొత్తం 32 మంది నిందితులనూ నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, అయోధ్య రామ మందిర స్థ‌లం కేసులోనూ హిందువుల‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వ‌డంతో రామ మందిర నిర్మాణ ప‌నులూ కొన‌సాగుతున్నాయి.

ఈ స‌మ‌యంలో బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో తీర్పును స‌వాలు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. అయోధ్యకు చెందిన హాజీ మహ్మద్‌ అహ్మద్‌ (74), సయ్యద్‌ అల్కఖ్‌ అహ్మద్‌ (81) అనే ఇద్దరు వ్య‌క్తులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేశారు. ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తరపున ఈ పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. కాగా, బాబ్రీ కూల్చివేత కేసులోఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, క‌ల్యాణ్‌ సింగ్, ఉమాభారతితో పాటు మొత్తం 32 మందిని సీబీఐ న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.