సిడ్నీ టెస్టులో భార‌త్ కు మ‌రో షాక్.. జ‌డేజాకూ గాయాలు

09-01-2021 Sat 12:35
  • ఇప్ప‌టికే ఎడ‌మ చేతికి గాయం కార‌ణంగా పంత్ కు స్కానింగ్
  • పంత్ స్థానంలో కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సాహా
  • జడేజా ఎడ‌మ‌చేతి బొట‌న‌వేలికి గాయం
Depleted India stretched further with Rishabh Pant and Ravindra Jadeja injuries

ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచు ఆడుతున్న టీమిండియాకు మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. టీమిండియా ఆట‌గాడు పంత్ కు ఇప్ప‌టికే గాయం కావ‌డంతో ఆయ‌న స్థానంలో కీపింగ్ బాధ్య‌త‌లను సాహా చేప‌ట్టాడు. ఇప్ప‌టికే ఎడ‌మ చేతికి గాయం కార‌ణంగా పంత్ ను స్కానింగ్ ప‌రీక్ష‌లకు పంపారు.

 ఇప్పుడు‌ మ‌రో భార‌త ఆట‌గాడికి గాయాలు కావ‌డం గ‌మ‌నార్హం. అద్భుతంగా రాణిస్తోన్న ర‌వీంద్ర జ‌డేజా ఎడ‌మ‌చేతి బొట‌న‌వేలికి గాయం కావ‌డంతో ఆయ‌న‌కు ప్రాథ‌మిక చికిత్స అందించిన వైద్య సిబ్బంది స్కానింగ్ కు త‌ర‌లించారు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు ఈ గాయమైంద‌ని బీసీసీఐ వివ‌రించింది.

మొద‌టి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 ప‌రుగులు చేసి ఆలౌటైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రెండో ఇన్నింగ్సును కొన‌సాగిస్తోంది. డేవిడ్ వార్న‌ర్ 13, ప‌కోష్కీ 10 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ల‌బుషేన్ 42, స్మిత్ 28 ప‌రుగులతో క్రీజులో ఉన్నారు. 28 ఓవ‌ర్ల నాటికి ఆసీస్ స్కోరు  97/2 గా ఉంది. సిరాజ్, అశ్విన్ కి చెరో వికెట్ ద‌క్కింది.

కాగా, తొలి ఇన్సింగ్స్ లో టీమిండియా 244 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. రోహిత్ శ‌ర్మ 26, శుభ్ మ‌న్ గిల్ 50, పుజారా 50, ర‌హానె 22, హ‌నుమ విహారి 4, పంత్ 36,  అశ్విన్ 10, సైనీ 3, బుమ్రా 0 ప‌రుగులు చేశారు.  జ‌డేజా 28 (నాటౌట్), సిరాజ్ 6 ప‌రుగులు చేశారు. మ‌రో 9 ప‌రుగులు ఎక్స్ ట్రాల రూపంలో వ‌చ్చాయి.