ప్రభాస్ 'ఆదిపురుష్'కి ముహూర్తం.. ముంబైలో షూటింగ్

09-01-2021 Sat 10:17
  • ప్రభాస్ స్ట్రెయిట్ హిందీ సినిమా 'ఆదిపురుష్'
  • విలన్ గా సైఫ్ అలీఖాన్.. నాయికగా కృతి సనన్ 
  • ఈ నెల 19 నుంచి ముంబైలో షూటింగ్
  • షూటింగ్ ఎక్కువ భాగం స్థూడియోలోనే  
Prabhas Adipurush movie to go on floors

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ సినిమా 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్రను పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక సీత పాత్రధారి ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బాలీవుడ్ భామ కృతి సనన్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంచితే, ఈ చిత్రం షూటింగును ఈ నెల 19 నుంచి నిర్వహించడానికి షెడ్యూల్స్ వేసినట్టు తెలుస్తోంది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ షూటింగుకి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఈ స్టూడియోలోనే  జరుగుతుందని సమాచారం. పౌరాణిక కథ కావడంతో వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ అవకాశం వుంది. అందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తారు.