తొలి ఇన్నింగ్స్ లో త‌డ‌బ‌డిన టీమిండియా

09-01-2021 Sat 09:40
  • టీమిండియా స్కోరు 99 ఓవ‌ర్ల‌కు 240/9
  • రోహిత్ శ‌ర్మ 26, శుభ్ మ‌న్ గిల్ 50, పుజారా 50 పరుగులు
  • తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 ప‌రుగులు
india scores 240

సిడ్నీ టెస్టు మొద‌టి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 ప‌రుగులు చేసి ఆలౌటైన విష‌యం తెలిసిందే. 96/2 ఓవ‌ర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భార‌త్ రాణించ‌లేక‌పోయింది. రోహిత్ శ‌ర్మ 26, శుభ్ మ‌న్ గిల్ 50, పుజారా 50, ర‌హానె 22, హ‌నుమ విహారి 4, పంత్ 36,  అశ్విన్ 10, సైనీ 4, బుమ్రా 0 ప‌రుగులు చేశారు. ప్ర‌స్తుతం క్రీజులో జ‌డేజా 23, , సిరాజ్ 6 ప‌రుగుల‌తో ఉన్నారు.  టీమిండియా స్కోరు 99 ఓవ‌ర్ల‌కు 240/9 గా ఉంది.

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో తొలి ఇన్నింగ్సులో స్టీవ్ స్మిత్ 131, ల‌బుషేన్ 91, ప‌కోష్కీ 62, డేవిడ్ వార్న‌ర్ 6, మాథ్యూ 13, కామెరాన్ గ్రీన్ 0, టిమ్ 1, క‌మ్మిన్స్ 0, స్టార్క్ 24, లైయ‌న్ 0, జొష్ 1 ప‌రుగులు చేశారు.