సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

09-01-2021 Sat 07:39
  • హిందీ సినిమా షూటింగులో రష్మిక 
  • 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ ఇదేనా?
  • 'ఇష్క్'లో ప్రియా ప్రకాశ్ వరియర్  
Rashmika joins Hindi film shoot

*  టాలీవుడ్ హాట్ బ్యూటీ రష్మిక  ఇటీవల రెండు హిందీ సినిమాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో మొదటి చిత్రం 'మిషన్ మజ్ను' షూటింగులో నిన్న ఈ ముద్దుగుమ్మ జాయిన్ అయింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శాంతను బాఘ్చి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
*  పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది.
*  తేజ సజ్జ హీరోగా ఎస్.ఎస్.రాజు దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ 'ఇష్క్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది. ఇందులో ప్రియా ప్రకాశ్ వరియర్ కథానాయికగా నటిస్తోంది.