తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్తకాపు శివసేనారెడ్డి

09-01-2021 Sat 06:36
  • ఇటీవల జరిగిన ఎన్నికల్లో శివసేనారెడ్డికి 59,997 ఓట్లు
  • ఉపాధ్యక్షుడిగా ఎం. రాజీవ్‌రెడ్డి
  • మహిళల కోటాలో ఉపాధ్యక్షురాలిగా నేనావత్ ప్రవల్లిక
sivasena reddy elected as telangana youth congress president

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్తకాపు శివసేనారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు భారత యువజన కాంగ్రెస్ (ఐవైసీ) ప్రకటించింది. వనపర్తి జిల్లా పెద్దగూడేనికి చెందిన ఆయన ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల్లో 59,997 ఓట్లు సాధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 52,203 ఓట్లు సాధించిన ఎం. రాజీవ్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కుమారుడు పోరిక సాయిశంకర్ ఎస్టీ కోటాలో మరో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  ఆయనకు 21,862 ఓట్లు వచ్చినట్టు ఐవైసీ తెలిపింది. మహిళల కోటాలో నేనావత్ ప్రవల్లిక ఉపాధ్యక్షురాలిగా గెలుపొందింది. మరో 15 మందికిపైగా ప్రధానకార్యదర్శులుగా గెలుపొందారు.