పవన్, హరీశ్ శంకర్ చిత్రానికి మ్యూజిక్ కంపోజింగ్

08-01-2021 Fri 21:32
  • పవన్, హరీశ్ కాంబోలో గతంలో 'గబ్బర్ సింగ్'
  • 'వకీల్ సాబ్' తర్వాత ప్రారంభమయ్యే సినిమా
  • దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో మ్యూజిక్ కంపోజింగ్   
Music sittings for Pawan new film

కొంతకాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు అంగీకరించిన సంగతి విదితమే. వీటిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రం వుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా ఎంతటి హిట్టయిందో మనకు తెలుసు. బాక్సాఫీసు వద్ద ఆ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రం పట్ల అప్పుడే క్రేజ్ ఏర్పడింది.

ఈ చిత్రం షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందన్న విషయంలో ఇంకా క్లారిటీ  లేనప్పటికీ, ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడీ చిత్రానికి కూడా పవన్ ఇమేజ్ కి తగ్గా ట్యూన్స్ ఇచ్చి మ్యూజికల్ గా హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ పూర్తి వినోదాత్మక పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.