పండుగ స్పెషల్... వడ్డీ రేట్లపై రాయితీలు ప్రకటించిన ఎస్బీఐ

08-01-2021 Fri 21:27
  • గృహ కొనుగోలుదారులకు ఎస్బీఐ తియ్యటికబురు
  • ఇంటి రుణాల వడ్డీరేట్లపై 30 బేసిస్ పాయింట్ల తగ్గింపు
  • మహిళలకు ప్రత్యేకంగా 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు
  • సిబిల్ స్కోరు ఆధారంగా రాయితీలు
SBI announced concessions on home loans

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీ రేట్లపై రాయితీలు ప్రకటించింది. గృహ రుణాల వడ్డీ రేటుపై 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రాసెసింగ్ రుసుం పూర్తిగా ఎత్తివేసింది. తాజాగా ప్రకటించిన రాయితీతో... రూ.30 లక్షల వరకు రుణాలపై ప్రారంభ వడ్డీరేటు 6.80 శాతం, రూ.30 లక్షలకు మించిన రుణాలపై ప్రారంభ వడ్డీరేటు 6.95 శాతం ఉంటుందని వివరించింది. మహిళలకు ప్రత్యేకంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా గృహ రుణాలు తీసుకునే వారు అదనంగా 5 బేసిస్ పాయింట్లు పొందే వీలుంటుంది. సిబిల్ స్కోరు ఆధారంగా ఈ రాయితీలు పొందేందుకు అర్హులు అవుతారని ఎస్బీఐ వెల్లడించింది.