ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో సీఎస్ ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారుల భేటీ

08-01-2021 Fri 19:43
  • ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ నిర్ణయం
  • వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రభుత్వం
  • సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్న హైకోర్టు
  • ఎన్నికలకు తాము సిద్ధంగా లేమన్న సీఎస్
  • కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు సాధ్యం కావని స్పష్టీకరణ
CS Adithya Nath Das and other senior officials met SEC Nimmagadda Ramesh Kumar over local body elections

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకోవడానికి చర్చలే మార్గమన్న హైకోర్టు సూచనల మేరకు ఇవాళ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో భేటీ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సీఎస్ వివరించారు. పైగా సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. అందువల్ల ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కాలేమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశాన్ని పునఃసమీక్షించుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేయాలని కోరారు. దీనిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందన తెలియాల్సి ఉంది.