ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 319 పాజిటివ్ కేసులు

08-01-2021 Fri 17:45
  • గత 24 గంటల్లో 59,671 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 46 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 5 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
ap corona details

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 59,671 కరోనా పరీక్షలు నిర్వహించగా, 319 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 46 కేసులు, చిత్తూరు జిల్లాలో 44 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో  5, ప్రకాశం జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 308 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,84,490 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,74,531 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,832 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,127కి చేరింది.