బొత్స, వెల్లంపల్లి చెప్పులేసుకుని ఆలయ శంకుస్థాపన స్థలానికి వచ్చారు... ఎంత భక్తో!: అయ్యన్నపాత్రుడు

08-01-2021 Fri 17:02
  • ఇటీవల రామతీర్థంలో చంద్రబాబు పర్యటన
  • బాబు కాళ్లకు బూట్లతో వచ్చారన్న వైసీపీ నేతలు
  • కౌంటర్ వేసిన అయ్యన్నపాత్రుడు
  • బొత్స, వెల్లంపల్లి ఫొటోలను పోస్టు చేసిన వైనం
  • ఫొటోలో కాళ్లకు చెప్పులతో ఉన్న బొత్స, వెల్లంపల్లి
Ayyanna Patrudu counters YCP leaders

ఇటీవల రామతీర్థం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్లకు బూట్లతో ఆలయ మెట్లు ఎక్కారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయడం తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ వేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స చెప్పులు వేసుకుని మరీ ఆలయాల శంకుస్థాపన ప్రదేశానికి వచ్చారని ఆరోపించారు. శంకుస్థాపన స్థలాన్ని అపవిత్రం చేయడం చూస్తే... వారికి దేవుడంటే ఎంత భక్తో తెలుస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. అంతేకాదు, ఆ మేరకు కాళ్లకు చెప్పులతో ఉన్న బొత్స, వెల్లంపల్లి శ్రీనివాస్ ల ఫొటోలను కూడా పంచుకున్నారు.