తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన సినిమాను చూడాలంటేనే అసహ్యం అంటున్న కేట్ విన్స్ లెట్

08-01-2021 Fri 14:09
  • 'టైటానిక్' సినిమాలో మెరిసిన కేట్ విన్స్ లెట్
  • ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పొందిన కేట్
  • ప్రస్తుతం 'అవతార్' సీక్వెల్ లో నటిస్తున్న కేట్
Kate Winslet says she dont like to watch Titanic movie

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 'టైటానిక్' సినిమాని చూడని వారు ఉండకపోవచ్చు. ఒక అద్బుతమైన రొమాంటిక్ క్లాసికల్ మూవీ అది. టైటానిక్ షిప్ మునిగిపోతున్న సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో కేట్ విన్స్ లెట్ కు చాలా పేరు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. తన కెరీర్ నే మలుపుతిప్పిన ఈ సినిమా అంటే కేట్ కు అసలు ఇష్టం ఉండదట. ఆ సినిమా చూడాలంటేనే అసహ్యం అని ఆమె అంటోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కామెరూన్ తెరకెక్కిస్తున్న 'అవతార్' సీక్వెల్ లో కేట్ నటిస్తోంది.