నన్నెందుకు చిత్రవధకు గురిచేస్తున్నారు?: కంగన రనౌత్

08-01-2021 Fri 13:12
  • ట్విట్టర్ లో స్పందించిన కంగన
  • తనకు ఎదురవుతున్న వేధింపులపై ఆవేదన
  • దేశం సమాధానాలు చెప్పాలంటూ ట్వీట్
  • తనకు మద్దతు కావాలంటూ విజ్ఞప్తి
Kangana Ranaut emotional tweet

బాలీవుడ్ నటి కంగన రనౌత్ ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు. తనను ఎందుకు చిత్రవధకు గురిచేస్తున్నారంటూ ప్రశ్నించారు. "మానసికంగా, భావోద్వేగాల పరంగా, భౌతికంగా ఎందుకు హింసిస్తున్నారు? ఈ దేశం నుంచి నేను జవాబులు తెలుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను మీ పక్షాన నిలిచాను, ఇప్పుడు మీరు నాకు మద్దతుగా నిలివాల్సిన సమయం వచ్చింది.. జైహింద్" అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనా తన గళాన్ని బలంగా వినిపించారు. ఇండస్ట్రీలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెకు, ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముంబయిలోని ఆమె కార్యాలయాన్ని అధికారులు పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. కొందరు నేతలకు, కంగనాకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా నడిచాయి.