శంషాబాద్ లో క‌ల‌క‌లం.. మ‌హిళ‌ను హ‌త్య చేసి త‌గుల‌బెట్టిన వైనం

08-01-2021 Fri 12:45
  • విమానాశ్రయంలోని ఎన్‌ఎండీసీ సర్కిల్‌ సమీపంలో ఘ‌ట‌న‌
  • బాధితురాలి వ‌య‌సు 35-40 ఏళ్ల‌‌ మధ్య ఉంటుందని అంచ‌నా
  • సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు
woman kills in shanshabad

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అక్క‌డి విమానాశ్రయంలోని ఎన్‌ఎండీసీ సర్కిల్‌ సమీపంలో ఓ గుర్తు తెలియ‌ని మహిళను  దుండ‌గులు హ‌త్య చేసి, త‌గుల‌బెట్టారు. ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్క‌డ‌కు చేరుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలి వ‌య‌సు 35-40 ఏళ్ల‌‌ మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఆమెను దుండ‌గులు గ‌త‌ రాత్రి హత్య చేసి ఉండొచ్చ‌ని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న‌ సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మ‌హిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.