ఆంధ్రప్రదేశ్ లో మ‌రో ఘ‌ట‌న‌.. వినాయ‌కుడి విగ్ర‌హం మాయం

08-01-2021 Fri 11:52
  • క‌డప జిల్లాలోని వేముల మండలంలో ఘ‌ట‌న‌
  • చాగలేరు గ్రామంలో వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వైనం
  • పోలీసుల‌కు ఫిర్యాదు
ganesha idol stolen in kadapa

ఆంధ్రప్రదేశ్ లో వ‌రుస‌గా దేవాల‌యాల‌పై దాడుల ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఆ ఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు.  విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ‌ రాముడి విగ్రహాన్ని కొంద‌రు ధ్వంసం చేసిన త‌ర్వాత క‌ల‌క‌లం చెల‌రేగిన‌ప్ప‌టికీ అనంత‌రం మ‌రికొన్ని విగ్ర‌హాలు ధ్వంసమ‌య్యాయి.

ఇప్పుడు ఓ ఆల‌యంలో దేవుడి విగ్ర‌హాన్ని పూర్తిగా మాయం చేశారు.  కడప జిల్లాలోని వేముల మండలం చాగలేరు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గ‌త‌ రాత్రి దుండగులు ఎత్తుకెళ్లిన‌ట్లు ఈ రోజు ఉద‌యం గ్రామ‌స్థులు గుర్తించారు. అనంత‌రం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్క‌డి ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించి ద‌ర్యాప్తు ప్రారంభించారు.