ఎల్బీన‌గ‌ర్ కు భారీగా త‌ర‌లివ‌స్తోన్న గో సంర‌క్ష‌కులు.. ట్రాఫిక్ జామ్‌

08-01-2021 Fri 11:02
  • ఆవుల సంరక్షణ కోసం గో సడక్ బంద్
  • యుగతులసి ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌
  • విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామన్న నిర‌స‌న‌కారులు
  • భారీగా మోహ‌రించిన పోలీసులు

ఆవుల సంరక్షణ కోసం గో సడక్ బంద్ నిర్వహించనున్నట్లు ఇటీవ‌లే టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. చెప్పిన‌ట్లుగానే యుగతులసి ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాలో ఈ రోజు బంద్ నిర్వహిస్తున్నారు. వంద‌లాది మంది గో సంర‌క్ష‌కులు త‌ర‌లివ‌స్తున్నారు.

విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని వారు అన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది గోరక్షణ జరగాలని, గోవధ శాలలను మూసేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గోమాతలు కబేళాలకు తరలిపోకుండా అడ్డుకోవాల‌ని, అలాగే, గోవును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అంటున్నారు. ఎల్బీ నగర్‌ చౌరస్తాలో పోలీసులు భారీగా మోహరించారు. త‌ర‌లి వ‌స్తోన్న‌ గోరక్షకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎల్బీనగర్ ప‌రిస‌న ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.