Indian Railways: గతేడాది రైలు టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు ఊరట.. టికెట్ల రద్దు గడువు మరో 3 నెలలు పొడిగింపు

Railways extends to 9 months time to claim refunds
  • గతేడాది మార్చి 21-జూన్ 31 మధ్య ప్రయాణికులకు ఊరట
  • బుక్ చేసినప్పటి నుంచి 9 నెలల్లోపు రద్దు చేసుకోవచ్చు 
  • పూర్తి మొత్తం రిఫండ్ చేస్తారు 
గతేడాది మార్చి 21-జూన్ 31 మధ్య రైల్వే కౌంటర్లలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు రైల్వే శాఖ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. లాక్‌డౌన్ కారణంగా అప్పట్లో రైళ్లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా సేవలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

దీంతో రైలు టికెట్లు తీసుకున్న ప్రయాణికులు వాటిని రద్దు చేసుకునేందుకు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఇప్పుడు ఆ సమయాన్ని మరో మూడు నెలలు పెంచి తొమ్మిది నెలలు చేసింది. ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసినప్పటి నుంచి 9 నెలల్లోపు ఎప్పుడైనా తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ప్రభుత్వం రద్దు చేసిన సాధారణ షెడ్యూల్డ్ రైలు ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కరోనా కారణంగా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కొద్దిమందిని మాత్రమే అనుమతించడంతో ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల గడువులో చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గడువును మరింత పెంచాలన్న అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని చెల్లించనున్నారు.
Indian Railways
Tickets
Refund
Corona Virus
Lockdown

More Telugu News