సిడ్నీ టెస్టులో 338 ప‌రుగుల‌కు ఆస్ట్రేలియా ఆలౌట్

08-01-2021 Fri 09:32
  • ఓవ‌ర్ నైట్ స్కోరు 166/2 తో ఆట ప్రారంభించిన ఆసీస్
  • స్టీవ్ స్మిత్ 131, ల‌బుషేన్ 91, ప‌కోష్కీ 62 ప‌రుగులు
  • టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌డేజాకు 4 వికెట్లు
australia all out

సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 166/2 తో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఈ రోజూ అంత‌గా రాణించ‌లేక‌పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో స్టీవ్ స్మిత్ 131, ల‌బుషేన్ 91, ప‌కోష్కీ 62 ప‌రుగులు చేశారు.

డేవిడ్ వార్న‌ర్ 6, మాథ్యూ 13, కామెరాన్ గ్రీన్ 0, టిమ్ 1, క‌మ్మిన్స్ 0, స్టార్క్ 24, లైయ‌న్ 0, జొష్ 1 (నాటౌట్) ప‌రుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో ఆసీస్ కు 10 ప‌రుగులు వ‌చ్చాయి. టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌డేజాకు 4, బుమ్రా, అశ్విన్ ల‌కు రెండేసి వికెట్లు, సిరాజ్ కు ఒక వికెట్ ద‌క్కింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ, శుభ్ మ‌న్ గిల్ క్రీజులోకి వ‌చ్చారు.