Telangana: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ అధ్యక్షుడి నియామకం: మాణికం ఠాగూర్

  • ఉత్తమ్ నేతృత్వంలోనే ఉప ఎన్నిక బరిలోకి
  • కొత్త కమిటీ కుదురుకునేందుకు సమయం పడుతుందన్న జానారెడ్డి
  • నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తమకు ఎంతో కీలకమన్న మాణికం ఠాగూర్
Congress leader Jana Reddy to be contested in Nagarjuna Sagar Bypolls

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాకూర్ స్పష్టత నిచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తమకు ఎంతో కీలకమని, ప్రస్తుతం ఉన్న కమిటీతోనే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. అప్పటి వరకు ఉత్తమ్ కుమారే పీసీసీ చీఫ్‌గా కొనసాగుతారని స్పష్టం చేశారు.

ఉప ఎన్నికలో బరిలోకి దిగేందుకు సీనియర్ నేత జానారెడ్డి సిద్ధంగా ఉన్నట్టు మాణికం ఠాగూర్ తెలిపారు. ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతోందని, ఈ నేపథ్యంలో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తే కుదురుకునేందుకు చాలా సమయం పడుతుందని, కాబట్టి ప్రస్తుత కమిటీతోనే ఎన్నికలకు వెళ్దామని జానారెడ్డి సూచించినట్టు మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. ఆయన అభ్యర్థనను అందరూ అంగీకరించినట్టు తెలిపారు. కాగా, ఉత్తమ్ కుమార్ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు.

More Telugu News