సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

08-01-2021 Fri 07:28
  • ఏడు భాషల్లో వస్తున్న రామ్ 'రెడ్'
  • 'వకీల్ సాబ్' టీజర్ కి ముహూర్తం  
  • ఇన్ స్టాలో అల్లు అర్జున్ దూకుడు  
Red to be released in Seven languages

*  రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'రెడ్' చిత్రాన్ని మొత్తం ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, కన్నడ వెర్షన్ లను ఈ నెల 14న .. తమిళ, మలయాళ, బెంగాలీ, భోజ్ పురీ, మరాఠీ భాషల అనువాదాలను ఈ నెలాఖరుకు విడుదల చేస్తున్నట్టు నిర్మాత స్రవంతీ రవికిశోర్ తెలిపారు.
*  చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్  నటిస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. సంక్రాంతికి రిలీజవుతుందనుకున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వేసవికి వెళ్లింది. అయితే, సంక్రాంతికి అభిమానులను ఖుషీ చేయడానికి టీజర్ ను వదులుతున్నారు. ఈ నెల 14న సాయంకాలం 6.03 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
*  సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు ఎంతో ఫాలోయింగ్ వుంది. తను ఇచ్చే అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో బన్నీ ఇన్ స్టాగ్రామ్ అకౌంటుకి తాజాగా 10 మిలియన్ల ఫాలోవర్స్ దాటిపోయారు. ఈ సందర్భంగా అభిమానులకు బన్నీ థ్యాంక్స్ చెప్పాడు.