Krishna River: కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చేసిన దేవాలయాల నిర్మాణానికి నేడు జగన్ శంకుస్థాపన!

Jagan Bhoomi Pooja today to Temples Demolished in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడ నదీ తీరంలో కూల్చివేసిన తొమ్మిది దేవాలయాల పునర్నిర్మాణానికి నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. నాడు రోడ్డులను వెడల్పు చేసే ప్రయత్నంలో ఆలయాలను తొలగించిన చంద్రబాబు సర్కారు, వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పి, చేయలేదు.

దీంతో ఇప్పుడు జగన్ సర్కారు ఆ బాధ్యతను తీసుకుంది. ఈ దేవాలయాలను సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జగన్ శంకుస్థాపన చేయనున్న ఆలయాల పునర్నిర్మాణ భూమిపూజ జరిగే ప్రదేశాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స, కనకదుర్గమ్మ దేవాలయ అభివృద్ధికి రూ. 70 కోట్లను మంజూరు చేశామని వెల్లడించారు.
Go Back to Shorts
Krishna River
Temples
Jagan

More Telugu News