కేజీఎఫ్-2 నుంచి టీజర్ విడుదల... వీడియో ఇదిగో!

07-01-2021 Thu 22:34
  • యశ్ హీరోగా కేజీఎఫ్ చాప్టర్ 2
  • రేపు యశ్ పుట్టినరోజు
  • ఒకరోజు ముందే కానుక ఇచ్చిన చిత్రబృందం
  • కేజీఎఫ్ తో పాన్ ఇండియా హీరోగా యశ్
Teaser from KGF TWO

కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అది. ఈ సినిమాతో యశ్ జాతీయస్థాయిలో పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ వసూళ్ల పరంగానూ రికార్డులు తిరగరాసింది. ఇప్పుడా సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 వస్తోంది. ఈ చిత్రం తాలూకు టీజర్ ఇవాళ రిలీజైంది. రేపు హీరో యశ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఆయన అభిమానులకు ఒకరోజు ముందే కానుక ఇచ్చింది.