కృష్ణంరాజుకు గవర్నర్ పదవి?

07-01-2021 Thu 18:19
  • తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు అని ప్రచారం
  • అభినందిస్తూ వెల్లువెత్తుతున్న సందేశాలు
  • ఫుల్ జోష్ లో ప్రభాస్ ఫ్యాన్స్
Goveronor post to Krishnam Raju news goes viral

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ గా ఆయనను నియమించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, కృష్ణంరాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. తమ అభిమాన హీరో పెదనాన్నకు గవర్నర్ పదవిని ఇవ్వబోతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ... బీజేపీలోనే కొనసాగుతున్నారు. ప్రభాస్ తో కలిసి ఇటీవల ప్రధాని మోదీని కూడా కలిశారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర సహాయమంత్రిగా కృష్ణంరాజు పని చేశారు. 2009లో ప్రజారాజ్యంలో చేరిన ఆయన... ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం మళ్లీ బీజేపీలో చేరారు.