రైలు కిందపడిన యువకుడు... శరీరం రెండు ముక్కలైనా మాట్లాడుతుండడంతో దిగ్భ్రాంతికి గురైన ప్రజలు!

07-01-2021 Thu 17:54
  • ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఘటన
  • ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హర్షవర్ధన్ అనే యువకుడు
  • రైలు కిందపడడంతో రెండు ముక్కలైన దేహం
  • మురికికాలువలో పడిన పైభాగం
  • దాదాపు 13 గంటలు బతికిన యువకుడు
Youth was talking after his body cuts into to pieces by train

ఉత్తరప్రదేశ్ లో దిగ్భ్రాంతి కలిగించే అంశం చోటుచేసుకుంది. ఇక్కడి షాజహాన్ పూర్ జిల్లా హతోడా గ్రామానికి చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇతరులు చూస్తుండగానే రైలు కిందపడ్డాడు.

 రైలు వేగంగా రావడంతో ఆ ధాటికి హర్షవర్ధన్ శరీరం రెండు ముక్కలైంది. అతని పైభాగం ట్రాక్ పక్కనే ఉన్న మురికి కాలువలో పడింది. అతడు చనిపోయి ఉంటాడని భావించిన స్థానికులు దగ్గరికి వెళ్లి చూశారు. హర్షవర్ధన్ మాట్లాడుతుండడంతో వాళ్లు నివ్వెరపోయారు. చచ్చిపోవాలన్న కోరికతోనే రైలు కిందపడ్డానని వాళ్లకు వివరించాడు. ఈ దృశ్యాలను కొందరు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు.

ఇక, విషాదం ఏంటంటే.... ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హర్షవర్ధన్ ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శరీరం రెండు ముక్కలైనా దాదాపు 13 గంటల పాటు బతికిన ఆ యువకుడు చివరికి మృతి చెందాడు.