KCR: కేసీఆర్ ఆరోగ్యానికి ఢోకా లేదు... విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది: డాక్టర్ ఎంవీ రావు

Doctor says no problem with CM KCR health
  • కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట
  • యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
  • మీడియాకు వివరాలు తెలిపిన వ్యక్తిగత వైద్యుడు
  • రెగ్యులర్ చెకప్ చేయించుకున్నారని వెల్లడి
  • ఎమ్మారై స్కానింగ్ అవసరంలేదని స్పష్టీకరణ
ఊపిరితిత్తుల్లో మంటతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అక్కడి వైద్యులు సీఎం కేసీఆర్ కు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించారు. కొద్దిసేపటిక్రితమే వైద్య పరీక్షలు ముగియడంతో కేసీఆర్ ప్రగతిభవన్ కు తిరుగుపయనమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు మీడియాకు వివరాలు తెలిపారు.

ఏటా క్రమం తప్పకుండా చేయించుకునే మెడికల్ టెస్టులనే సీఎం కేసీఆర్ ఇవాళ కూడా చేయించుకున్నారని, ఆరోగ్యపరంగా ఆందోళన చెందాల్సిన అంశాలేవీ లేవని వెల్లడించారు. ముఖ్యంగా ఆయనలో కరోనా లక్షణాలు లేవని వివరించారు.  సీటీ స్కాన్ చేశామని, ఆ నివేదిక రేపు వస్తుందని తెలిపారు. కేసీఆర్ కు ఎమ్మారై స్కానింగ్ అవసరంలేదని, ఆయన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.
KCR
Health
Yashoda Hospital
Medical Tests
Hyderabad

More Telugu News