మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వలంటీర్ల నమోదు పూర్తి: భారత్ బయోటెక్ ప్రకటన

07-01-2021 Thu 17:00
  • అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన కొవాగ్జిన్
  • మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశలో వ్యాక్సిన్
  • తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి
  • మూడో దశలో 26 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యం
  • 28,500 మంది పేర్ల నమోదు
Covaxin third phase clinical trials enrollment completed

భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్లలో కొవాగ్జిన్ ఒకటి. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్ తో కలిసి సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాగా, ప్రస్తుతం కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశలో ఉంది. తాజాగా, ఈ మూడో దశ ప్రయోగాల కోసం వలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని భారత్ బయోటెక్ వెల్లడించింది.

మూడో దశ క్లినికల్ ప్రయోగాల కోసం తాము 26  వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని భావించామని, 25,800 మంది వలంటీర్లు ముందుకొచ్చారని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థ జేఎండీ సుచిత్రా ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్  అభివృద్ధి చేసే క్రమంలో తమకు సహకరిస్తున్న అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.