Joe Biden: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఖరారు

  • నవంబరు 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  • డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ విజయం
  • బైడెన్ కు 306, ట్రంప్ కు 232 ఎలక్టోరల్ ఓట్లు
  • నిర్ధారించిన చట్టసభలు
US Congress joint session certified Joe Biden as new President

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ శకం ముగిసింది! అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఖరారయ్యారు. ఆయన విజయాన్ని అమెరికా ఎలక్టోరల్ కాలేజ్ ధ్రువీకరించింది. తద్వారా జో బైడెన్ ఈ నెల 20న దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగమం చేసింది. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్తి బైడెన్ కు అనుకూలంగా 306 ఓట్లు, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ కు మద్దతుగా 232 ఓట్లు వచ్చినట్టు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నిర్ధారించారు.  అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కూడా ఈ మేరకు ధ్రువీకరించడంతో అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ఖరారయ్యారు. దేశ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా ఖరారయ్యారు. గతేడాది నవంబరు 3న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News