Bhuma Akhila Priya: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

  • భూ వివాదంలో ముగ్గురు సోదరుల కిడ్నాప్
  • కూకట్ పల్లిలో అఖిలప్రియ అరెస్ట్
  • బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న అఖిలప్రియ
  • కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు
Hearing adjourned on Akhilapriya bail plea

కిడ్నాప్ కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఓ భూ వివాదంలో ప్రవీణ్ రావు, సునీల్, నవీన్ అనే ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు తమ రిపోర్టులో అఖిలప్రియను ఏ1 గా పేర్కొన్నారు. నిన్న ఆమెను కూకట్ పల్లి నివాసం నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. రాత్రి జైలులో ఆమె ఏమీ తినలేదని తెలుస్తోంది. ఇవాళ ఉదయం పండ్ల రసం తీసుకున్నట్టు జైలు అధికారులు తెలిపారు. అటు, అఖిలప్రియ భర్త, ఈ కేసులో ఏ3 నిందితుడైన భార్గవరామ్ పరారీలో ఉన్నాడు.

More Telugu News