సీఎం కేసీఆర్‌కు యశోదలో వైద్య పరీక్షలు

07-01-2021 Thu 14:33
  • ఊపిరితిత్తుల్లో మంటతో బాధ పడుతున్న కేసీఆర్
  • నిన్న కేసీఆర్ ను పరీక్షించిన వ్యక్తిగత వైద్యులు
  • నేడు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేయించుకోనున్న సీఎం
KCR to under go health checkup
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళ్తే కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో... ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు, శ్వాసకోశ నిపుణులు నవనీత సాగర్, హార్ట్ స్పెషలిస్ట్ ప్రమోద్ తదితరులు నిన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రికి వారు సూచించారు. దీంతో ఆ పరీక్షలు చేయించుకోవడానికి ఆయన నేటి మధ్యాహ్నం హైదరాబాదులోని యశోదా హాస్పిటల్ కి వెళ్లనున్నట్టు సమాచారం.