మన సీఎం పనితీరుకు ఇదే నిదర్శనం: విజయసాయిరెడ్డి

07-01-2021 Thu 14:29
  • ఏపీకి రివార్డు ప్రకటించిన కేంద్రం
  • పౌరసేవల అమలుకు గుర్తింపు
  • ఏపీకి రూ.344 కోట్లు దక్కాయన్న విజయసాయిరెడ్డి
  • మధ్యప్రదేశ్ కు కేంద్రం నుంచి రూ.660 కోట్ల రివార్డు
YCP MP Vijaysai Reddy heaps praise on CM Jagan over Union Government reward

మన ప్రియతమ ముఖ్యమంత్రి పనితీరుకు మరో నిదర్శనం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. పౌరసేవల అమలులో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం రివార్డును ప్రకటించిందని వెల్లడించారు. వన్ నేషన్-వన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలు అమలు చేయడంలో ఏపీ ముందంజ వేసిందని, తత్ఫలితంగానే కేంద్రం గుర్తింపు లభించిందని వివరించారు. సీఎం పనితీరు వల్ల రూ.344 కోట్లు దక్కాయని విజయసాయి తెలిపారు.

కాగా, కేంద్రం నిన్న ఓ ప్రకటనలో మధ్యప్రదేశ్, ఏపీలకు రివార్డు ఇస్తున్నట్టు తెలిపింది. స్పెషల్ అసిస్టెన్స్ కింద మొత్తం రూ.1,004 కోట్లతో రివార్డు ప్రకటించగా, మధ్యప్రదేశ్ కు రూ.660 కోట్లు, ఏపీకి రూ.344 కోట్లు లభించాయి. పౌరసేవల సంస్కరణల్లో నాలుగింట మూడు సంస్కరణలు అమలు చేసినందుకు ఈ రివార్డు ప్రకటించారు.