దేవాల‌యాల‌పై దాడుల‌పై అమిత్ షా గారితో మాట్లాడాను: జీవీఎల్‌

07-01-2021 Thu 13:37
  • దేవాలయాలపై జరుగుతున్న వరుసదాడుల గురించి తెలిపాను
  • బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న తీరుని వివరించాను
  • త్వరలో కలిసి వివరాలు అందించబోతున్నాం
gvl telephoned shah

విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం ఘ‌ట‌న ఆంధ్ర ప్ర‌దేశ్ లో క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. మ‌రికొన్ని దేవాల‌యాల్లోనూ దేవుళ్ల విగ్ర‌హాల ధ్వంసాల ఘ‌ట‌న‌లు వ‌రుస‌గా చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బీజేపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు దీనిపై ఓ ట్వీట్ చేశారు.

ఈ ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారితో ఫోన్లో మాట్లాడి రామతీర్థంలో, అలాగే వందల దేవాలయాలపై రాష్ట్రంలో జరుగుతున్న వరుసదాడుల గురించి తెలియజేశాను. బీజేపీ నాయకులను అమానుషంగా అరెస్ట్ చేస్తున్న తీరుని వివరించాను. రాష్ట్ర బీజేపీ నేత‌లం త్వరలో కలిసి వివరాలు అందించబోతున్నాం.  'రాష్ట్రంలో దేవాల‌యాల‌ను కాపాడాలి' అని జీవీఎల్ ట్వీట్ చేశారు.