Corona Virus: మెగా హీరో వ‌రుణ్ తేజ్ కు క‌రోనా నెగిటివ్

VarunTej Tests Negative for corona
  • ఇటీవ‌ల మెగా కుటుంబాన్ని క‌ల‌వ‌రపెట్టిన క‌రోనా
  • చెర్రీతో పాటు వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్
  • క్వారంటైన్ లో ఉన్న‌ వ‌రుణ్ తేజ్
  • త‌న‌కు నెగిటివ్ వ‌చ్చిందంటూ ట్వీట్   
ఇటీవ‌ల మెగా కుటుంబాన్ని క‌రోనా క‌ల‌వ‌రపెట్టిన విష‌యం తెలిసిందే. మెగా హీరో రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావ‌డంతో మెగా కుటుంబ స‌భ్యులు అందోళ‌న చెందారు. అంత‌కు ముందే నిహారిక పెళ్లిలో మెగా కుటుంబం అంతా క‌లవ‌డంతో వారిలో చాలా మంది క‌రోనా పరీక్ష‌లు చేయించుకున్నారు. ఈ క్రమంలో క్వారంటైన్ లో ఉంటోన్న వ‌రుణ్ తేజ్ త‌న‌కు నెగిటివ్ వ‌చ్చింద‌ని ఈ రోజు ప్ర‌క‌టించాడు.

'నెగిటివ్ అంటూ వ‌చ్చే రిపోర్టు ఇంత‌గా ఆనందానిస్తుంద‌ని నేను ఎన్న‌డూ అనుకోలేదు. అవును.. నాకు నెగిటివ్ వ‌చ్చింది. మీ అంద‌రి ప్రేమ‌కు, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని వ‌రుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. వ‌రుణ్ తేజ్ చేతిలో ప్ర‌స్తుతం బాక్స‌ర్, ఎఫ్ 3  సినిమాలు ఉన్నాయి.
Corona Virus
COVID19
Varun Tej
Ramcharan

More Telugu News