sun: సూర్యుడి దక్షిణార్ధ గోళంలో రెండు అయస్కాంత ఫిలమెంట్ల విస్ఫోటనం

  • ఈ నెల 2వ తేదీన  విప్ఫోట‌నం
  • దీని ప్ర‌భావం అంతరిక్ష వాతావరణంపై ఉండొచ్చు
  • ఎన్నో ఉద్గారాలు అంతరిక్షంలో వెలువడ్డాయి
  • అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా'
Huge Explosions on the Sun

సూర్యుడి దక్షిణార్ధ గోళంలో రెండు అయస్కాంత ఫిలమెంట్లు విస్ఫోటనం చెందాయ‌ని, దీని ప్ర‌భావం అంతరిక్ష వాతావరణంపై ప‌డ‌వ‌చ్చ‌ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. ఈ నెల 2వ తేదీన ఈ విప్ఫోట‌నం సంభ‌వించింద‌ని పేర్కొంది. పేలుళ్ల కార‌ణంగా ఎన్నో ఉద్గారాలు అంతరిక్షంలో వెలువడ్డాయ‌ని తెలిపింది.

వాటిల్లో కొన్ని భూమిని కూడా ఢీ కొట్టే అవ‌కాశం ఉందని చెప్పింది. ఈ కార‌ణం వ‌ల్లే భూమిపై రేడియో, అయస్కాంత తరంగాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. ప్లాస్మా, అయస్కాంత తరంగాలు పేలడాన్ని కరోనిల్‌ మాస్‌ ఎజెక్షన్ అని పిలుస్తారు.

ఆ రెండింటి బరువు బిలియన్‌ టన్నుల్లో ఉంటుంది. మొదటి సీఎంఈ మెల్లిగా, రెండో సీఎంఈ సూర్యుడి నుంచి వేగంగా ప్ర‌యాణిస్తుంటుంది. ఆయా ఉద్గారాలకు అయస్కాంత శక్తి కూడా ఉంటుంది. దీంతో ఆ ప్ర‌భావం రేడియో, అయ‌స్కాంత త‌రంగాల‌పై ప‌డే అవ‌కాశం ఉంది. సూర్యుడి నుంచి ఆ ఉద్గారాలు దూరం వెళ్లే కొద్దీ వాటి సైజులు పెద్దవిగా అవుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

  • Loading...

More Telugu News