సొమ్మసిల్లి పడిపోయిన సోము వీర్రాజు

07-01-2021 Thu 11:14
  • రామతీర్థంకు వెళ్లేందుకు యత్నించిన బీజేపీ నేతలు
  • నెల్లిమర్ల వద్ద నేతలను అడ్డుకున్న పోలీసులు
  • తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన వీర్రాజు
Somu Veerraju fell down during rift with police

విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రామతీర్థంకు వెళ్తున్న బీజేపీ కీలక నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులను నెల్లిమర్ల వద్ద పోలీసులు ఆపేశారు. వారు ముందుకు వెళ్లకుండా బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు.

ఈ నేపథ్యంలో బ్యారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు వారు యత్నించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశాయి. మరోవైపు ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు.