ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జయిన గంగూలీ.. వీడియో ఇదిగో

07-01-2021 Thu 11:00
  • గుండెపోటుతో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న గంగూలీ
  • త‌న ప‌రిస్థితి పూర్తిగా బాగుంద‌న్న సౌరవ్ 
  • వైద్యులు, ఆసుప‌త్రికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నానని వ్యాఖ్య
Sourav Ganguly discharged from Woodlands Hospital in Kolkata

గుండెపోటుతో కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న‌ టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆసుప‌త్రి వెలుప‌ల మాట్లాడుతూ... త‌న ప‌రిస్థితి పూర్తిగా బాగుంద‌ని, వైద్యులకు, ఆసుప‌త్రి సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని తెలిపారు.

కాగా, ఆయ‌న నిన్ననే డిశ్చార్జి కావాల్సి ఉండ‌గా,  కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌నను వైద్యులు డిశ్చార్చి చే‌య‌లేద‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం గంగూలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. నేటి నుంచి గంగూలీ ఆరోగ్య ప‌రిస్థితిని ఆయ‌న ఇంట్లోనే వైద్యులు ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.