యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ కూల్చి వేస్తామంటూ ఆడియో... అమెరికాలో కలకలం!

07-01-2021 Thu 10:54
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీలో ఆడియో
  • గుర్తు పట్టకుండా డిజిటైజ్డ్ వాయిస్
  • రంగంలోకి దిగిన ఎఫ్బీఐ
  • సొలైమనీ మృతికి ప్రతీకారం తప్పదని మెసేజ్
Will Blast White House Audio Viral

ఇరాన్ సైనిక జనరల్ సొలైమని మృతికి ప్రతీకారం తీర్చుకుని తీరుతామని, అమెరికాలోని క్యాపిటల్ భవనాన్ని ను విమానంతో పేల్చి వేస్తామంటూ ఓ ఆడియో మెసేజ్ వైరల్ కావడం కలకలం రేపింది. ఈ ఆడియో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీ మధ్యలో వినిపించడం గమనార్హం. దీంతో ఎఫ్బీఐ, ఎఫ్ఏఏ బృందాలు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. ఈ గొంతు ఎవరిదన్న విషయాన్ని గుర్తు పట్టకుండా డిజిటైజ్డ్ వాయిస్ తో రికార్డు చేయడం గమనార్హం.

కాగా, గత సంవత్సరం జనవరి 3న అమెరికా జరిపిన సైనిక దాడిలో ఖాసీం సొలైమనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆపై ఇరాక్ లో అమెరికా ఎంబసీపై, అమెరికన్లపై ఇరాన్ వర్గాలు దాడులు చేశాయి. ఇరాన్ కోర్టులు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు అధికారులపై వారంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.