Nithin: కాలినడకన తిరుమల కొండెక్కిన హీరో నితిన్

Hero Nithin arrives Tirumala by walk from Alipiri
  • శ్రీవారి క్షేత్రానికి హీరో నితిన్
  • ఎంతో హుషారుగా మెట్ల మార్గంలో నడిచిన నితిన్
  •  కెమెరాల్లో బంధించిన భక్తులు
  • నెట్టింట సందడి చేస్తున్న వీడియో
టాలీవుడ్ యువ హీరో నితిన్ ఇవాళ తిరుమల విచ్చేశారు. ఆయన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు. అలసటను కూడా లెక్కచేయకుండా ఆయన వడివడిగా మెట్లెక్కుతూ కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. కాగా, నితిన్ ను శ్రీవారి మెట్ల మార్గంలో చూసిన ఇతర భక్తులు ఆయనను తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేశారు.

పలువురు సెల్ఫీలకు ప్రయత్నించగా, నితిన్ వ్యక్తిగత సిబ్బంది వారించారు. కాగా, హీరో నితిన్ 'రంగ్ దే' చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదే కాకుండా 'చెక్' అనే సినిమాలోనూ నటిస్తున్నారు. అటు, బాలీవుడ్ హిట్ 'అంధాదున్' రీమేక్ లోనూ నితిన్ హీరోగా చేస్తున్నారు.
Nithin
Tirumala
Walk
Alipiri
Tollywood

More Telugu News