Price Hike: దేశంలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • 29 రోజుల తర్వాత ధరల సవరణ
  • కొద్దిమేర ధరలు పెంచిన చమురు సరఫరా కంపెనీలు
  • లీటర్ పెట్రోల్ పై 26 పైసలు పెంపు
  • లీటర్ డీజిల్ పై 25 పైసలు పెంపు
Petrol and Diesel prices hike in country

దాదాపు 29 రోజుల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. రోజువారీ విధానంలో ఇంధన ధరల సవరణ చేస్తున్న చమురు కంపెనీలు సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ తాజా ధరలను ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, లీటర్ డీజిల్ పై 25 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ పెంపు అనంతరం దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.97కి చేరింది. డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ.73.87 నుంచి రూ.74.12కి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.19కి చేరగా, డీజిల్ ధర రూ.83.25కి పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ లీటర్ ధర రూ.87.34 కాగా, డీజిల్ ధర రూ.80.88కి చేరింది.

More Telugu News