ఆసీస్ తో మూడో టెస్టుకు భారత జట్టు ఎంపిక

06-01-2021 Wed 13:44
  • రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు
  • సిడ్నీ వేదికగా మ్యాచ్
  • జట్టులో పునరాగమనం చేసిన రోహిత్ శర్మ
  • కెరీర్ లో తొలి టెస్టు ఆడనున్న నవదీప్ సైనీ
Teamindia announced for third test against Australia

రేపటి నుంచి సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టు కోసం భారత జట్టును ప్రకటించారు. ఫామ్ కోల్పోయి పరుగులు చేయడంలో విఫలమవుతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను తప్పించి, ఫిట్ నెస్ నిరూపించుకున్న రోహిత్ శర్మకు స్థానం కల్పించారు. ఇక, యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేస్తున్నాడు. ఉమేశ్ యాదవ్ గాయపడడంతో ఆ స్థానానికి శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ల పేర్లను కూడా పరిశీలించిన టీమ్ మేనేజ్ మెంట్, ఎక్స్ ప్రెస్ వేగంతో బౌలింగ్ చేసే సైనీ వైపే మొగ్గుచూపింది. కాగా, నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా, టీమిండియా చెరో టెస్టు గెలిచి 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి.

మూడో టెస్టులో ఆడే భారత జట్టు ఇదే...

అజింక్యా రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ.