Jin Ping: ఏ క్షణాన యుద్ధం వచ్చినా.. సిద్ధంగా ఉండాలని సైన్యానికి జిన్ పింగ్ ఆదేశం!

  • పూర్తి సన్నద్ధతగా ఉండాలి
  • వాస్తవ యుద్ధరంగాన్ని పోలిన పరిస్థితుల్లో శిక్షణ
  • నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలన్న జిన్ పింగ్
Jin Ping Told Army to Get Ready for War

ఏ క్షణాన యుద్ధం వచ్చినా, పూర్తి సన్నద్ధతతో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పీపుల్స్ ఆర్మీకి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అప్రమత్తత సందేశాన్ని ఇచ్చారు. సైనిక బలగాలపై అధ్యక్షునికి విస్తృత అధికారాలను కల్పిస్తూ, కొత్త రక్షణ చట్టం చైనాలో అమలులోకి రాగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైనికులు పోరాట నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరచుకోవాలని సూచించిన ఆయన, వాస్తవ యుద్ధరంగాన్ని పోలి వుండే పరిస్థితుల్లో శిక్షణ పొందాలని ఆదేశించారు.

పోరాట వ్యూహాలపై మరింత పరిశోధనలు చేయాలని, అధునాతన ఆయుధాలను వాడే విధానం, వాటి ప్రయోగాల విషయంలో పూర్తి అవగాహన కలిగి వుండాలని జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు. కాగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగానూ ఉన్నారు. ఈ కమిషన్ కు సంబంధించిన తొలి ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

More Telugu News