DSP Sunil: రామతీర్థంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నాం... చట్టాలను ఎవరూ అతిక్రమించవద్దు: డీఎస్పీ సునీల్

  • రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చిన బీజేపీ-జనసేన
  • నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందన్న డీఎస్పీ
  • సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టీకరణ
 DSP Sunil says nobody should violate laws in Ramatheertham

రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటనను నిరసిస్తూ ఇవాళ బీజేపీ-జనసేన తలపెట్టిన ధర్మయాత్ర ఉద్రిక్తతలకు కారణమైంది. రామతీర్థం వచ్చేందుకు సిద్ధమైన బీజేపీ, జనసేన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. రామతీర్థంలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీనిపై డీఎస్పీ సునీల్ మీడియాకు వివరాలు తెలిపారు. రామతీర్థం ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొని ఉందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా రామతీర్థం ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతి లేదని వెల్లడించారు.

రామతీర్థంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించద్దని స్పష్టం చేశారు. పైగా, కొవిడ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయని వివరించారు. చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్సీ సునీల్ హెచ్చరించారు. విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

More Telugu News