Yamini Sadineni: విగ్రహాల ధ్వంసంపై బీజేపీ నేత యామిని కంటతడి.. కన్నీరు త్రిశూలంలా మారి నిందితుల పనిపడుతుందని హెచ్చరిక!

BJP leader yamini sadineni tears on attacks on Temples
  • విగ్రహాలపై వరుస దాడులపై స్పందించిన యామిని
  • మనం భారత్‌లోనే ఉన్నామా? అని అనుమానం
  • ఈ ఘటనలతో హిందువుల గుండెలు రగిలిపోతున్నాయంటూ కన్నీరు
ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ ఆలయాలపై వరుసపెట్టి జరుగుతున్న దాడులపై బీజేపీ నేత సాదినేని యామిని కంటతడిపెట్టుకున్నారు. వరుస దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న అంతర్వేదిలో స్వామివారి రథం దగ్ధమైందని, ఇప్పుడు రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఈ ఘటనలు చూస్తుంటే మనం అసలు భారతదేశంలోనే ఉన్నామా? అన్న అనుమానం వస్తోందన్నారు. విగ్రహాలు ధ్వంసమవుతుంటే హిందువుల గుండెలు రగిలిపోతున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

హిందువులు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్కా త్రిశూలంలా మారి ముష్కరులను అంతం చేస్తుందని యామని హెచ్చరించారు. విగ్రహాలు ధ్వంసమవుతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేక చోద్యం చూస్తోందని కన్నీరు పెట్టుకున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లకు అవమానం జరిగిన చోట మహాసంకల్పానికి బీజం పడాలని యామిని అన్నారు.
Yamini Sadineni
BJP
Andhra Pradesh

More Telugu News