Somireddy Chandra Mohan Reddy: ఎయిర్ పోర్టు రన్ వేపై అరెస్ట్ చేయడానికి బీటెక్ రవి అంతర్జాతీయ నేరస్తుడా?: సోమిరెడ్డి

Somireddy questions AP government on BTech Ravi arrest in Chennai airport
  • నిన్న చెన్నైలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్
  • బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 2018 నాటి కేసులో అరెస్ట్
  • ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన సోమిరెడ్డి
2018 నాటి కేసులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు నిన్న చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేయడం తెలిసిందే. బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన ఆయనను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. బీటెక్ రవి ఓ ఎమ్మెల్సీ అని, చట్టసభ్యుడు అని తెలిపారు. అలాంటి వ్యక్తిని ఎప్పటిదో పాత కేసులో ఓ అంతర్జాతీయ నేరస్తుడిలా ఎయిర్ పోర్టు రన్ వేపై అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. పైగా అది అందరికీ బెయిల్ వచ్చిన కేసు అని సోమిరెడ్డి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల మీద పెట్టిన దృష్టి ప్రజల బాగోగులపై పెడితే రాష్ట్రమన్నా బాగుపడుతుందని హితవు పలికారు.
Somireddy Chandra Mohan Reddy
BTech Ravi
Arrest
Chennai
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News