క్రికెట్ స్టేడియంలోనూ వార్న‌ర్ 'బుట్టబొమ్మ' డ్యాన్సు చేయ‌డం ఆశ్చ‌ర్య‌మ‌నిపించింది: అల్లు అర్జున్

04-01-2021 Mon 13:36
  • సామ్ జామ్ లో చెప్పిన అల్లు అర్జున్
  • పాట వైర‌ల్ కావ‌డానికి వార్న‌ర్ పాత్ర ఉంద‌ని వ్యాఖ్య‌
  • యూనిట్ సభ్యుల పాత్ర కూడా చాలా ఉందన్న బ‌న్నీ
waner makes buttabomma song viral says bunny

'అల వైకుంఠపురములో' సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట, డ్యాన్సు చాలా ఫేమ‌స్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన‌ స్టెప్పులు అదరగొట్టేశాయి. యూట్యూబ్‌లో ఈ పాట కోట్లాది వ్యూస్‌ సాధిస్తూ టాలీవుడ్ అభిమానులను ఖుషీ చేసింది. ఈ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేయడంతో మ‌రింత పాప్యులారిటీ సంపాదించింది.

ఆ త‌ర్వాత కూడా ఆయ‌న ప‌లుసార్లు ఈ పాట‌కు  స్టెప్పులు వేస్తూ కనపడ్డాడు. దీనిపై సామ్ జామ్ ప్రోగ్రాంలో బ‌న్నీ స్పందించాడు. ఈ పాట ఇంత‌గా   విజయవంతమవడానికి డేవిడ్ వార్నర్ కూడా కారణమని   చెప్పాడు. అలాగే, ఆ పాట అంత సక్సెస్ కావడంలో యూనిట్ సభ్యుల పాత్ర కూడా చాలా ఉంద‌ని తెలిపాడు. అంతే సమానమైన పాత్ర‌ వార్నర్‌కు కూడా ఉందని,  టిక్‌టాక్ ద్వారా ఆ పాటను వార్నర్ వైరల్ చేశాడని చెప్పాడు.  క్రికెట్ సిరీస్ సందర్భంగానూ స్టేడియంలో వార్నర్ ఆ పాట‌కు స్టెప్ వేయడం ఆశ్చర్యం కలిగించిందని  అన్నాడు.