Telugudesam: 'టీడీపీలోకి వెళ్లిపోదామా?'.. కార్య‌క‌ర్త‌ల‌ను అడిగిన వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు

  • వైసీపీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని  అసంతృప్తి
  • చంద్ర‌బాబు ఒప్పుకుంటే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని వ్యాఖ్య‌?
  • ఇప్ప‌టి వ‌ర‌కు తాను జ‌గ‌న్ ను క‌లిసిన సంద‌ర్భం లేదన్న డేవిడ్
  • గౌర‌వం అనేది చాలా ముఖ్యం అని వ్యాఖ్య‌లు  
 YCP leader David Raju likely to join TDP

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత‌లు అధికార పార్టీలోకి వెళ్తారు. అయితే, ఏపీలో సీన్ రివర్స్ అవుతూ టీడీపీలోకి వైసీపీ నేత డేవిడ్ రాజు వెళ్తున్నారు. వైసీపీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని ఆయ‌న‌ అసంతృప్తితో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఒంగోలులో తన అనుచరులు, మ‌ద్ద‌తుదారుల‌తో భేటీ అయి టీడీపీలోకి వెళ్లిపోదామా? అన్న విష‌యంపై ప్ర‌శ్నించారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యకర్తలు ఆయ‌న‌ను ఆ పార్టీలోకి రమ్మంటున్నారని స‌మాచారం. దీంతో వారి విన‌తికి ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిసింది.

చంద్ర‌బాబు ఒప్పుకుంటే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని డేవిడ్ రాజు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. తాజాగా, ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... 'ఇప్ప‌టి వ‌ర‌కు నేను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను క‌లిసిన సంద‌ర్భం లేదు. ప‌దవులు శాశ్వ‌తం కాదు.. ముఖ్యం కాదు.. కానీ, గౌర‌వం అనేది చాలా ముఖ్యం' అన్నారు. తనను క‌లిసేందుకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న మ‌న‌స్తాపంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News