Budda Venkanna: గుడివాడ గడ్డం గ్యాంగ్ పై దాడి చేశారు: బుద్ధా వెంక‌న్న‌

budda venkanna slams ap minister
  • తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే
  • రాత్రి నుంచి తాడేపల్లిలో సెటిల్మెంట్ జరుగుతుంది
  • కమిషన్ పెంచగానే, కేసు ఉండదు, ఏమి ఉండదు  
వైసీపీ ప్ర‌భుత్వంలోని ఓ  కీలక మంత్రి కనుసన్నల్లో కృష్ణా జిల్లాలో 'గడ్డం గ్యాంగ్‌' నడుపుతున్న పేకాట డెన్‌ గుట్టు రట్టయిందంటూ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న విమ‌ర్శ‌లు గుప్పించారు. తమిరశ గ్రామంలో గ‌త‌ రాత్రి ఎస్‌ఈబీ దాడులు జరిపి 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుందని, 28 కార్లు, కోట్ల కొద్దీ నగదు స్వాధీనం చేసుకుంద‌ని, మంత్రి అనుచరులు పేకాట శిబిరాలను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తుంటారని ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నంలో పేర్కొన్నారు.

వీటిని బుద్ధా వెంక‌న్న ప్ర‌స్తావించారు. 'తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. పేకాటలో వచ్చే కమిషన్ ను, తాడేపల్లికి తక్కువ చేసి చూపించటం, మోసం చేయటంతో, డిఫ్యాక్టో హోం మినిస్టర్ ఆదేశాల ప్రకారం, గుడివాడ గడ్డం గ్యాంగ్ పై దాడి చేశారు. రాత్రి నుంచి తాడేపల్లిలో సెటిల్మెంట్ జరుగుతుంది. కమిషన్ పెంచగానే, కేసు ఉండదు ఏమి ఉండదు' అని విమ‌ర్శ‌లు గుప్పించారు.
Budda Venkanna
Telugudesam
Andhra Pradesh

More Telugu News